by Suryaa Desk | Sat, Nov 23, 2024, 01:09 PM
తుంగభద్ర బోర్డు సమావేశం ఇవాళ(శనివారం) జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తుంగభద్ర డ్యామ్‌కు 33 గేట్లు ఒకేసారి మార్చాలని నిర్ణయించింది. క్రస్ట్ గేట్లపై డీపీఆర్ సిద్ధం చేయించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. తుంగభద్ర అకౌంట్స్ ఫ్రీజ్ తొలగించాలని కోరింది. తుంగభద్రలో పూడిక కారణంగా కర్ణాటక ప్రతిపాదిస్తున్న నవళి జలాశయం నిర్మాణ ప్రతిపాదన సహాతుకమైనది కాదని తెలిపింది.
కేసీ కెనాల్‌కు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కృష్ణా నీటి మళ్లింపు ట్రైబ్యునల్‌కు విరుద్ధంగా ఉందని చెప్పింది. కాగా కర్ణాటక, ఏపీ ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది.కాగా.. గతంలో ఏపీ ప్రభుత్వానికి, తుంగభద్ర బోర్డుకు మధ్య వివాదం తలెత్తింది.జగన్ హయాంలో తుంగభద్ర కాలువల ఆర్‌సీసీ లైనింగ్ కోసం పిలిచిన టెండర్లలో నిబంధనలను పాటించలేదని, ఆనాటి వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడి చీకటి ఒప్పందాలు చేసుకున్నారనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం ఆ పనులను రద్దు చేస్తూ సెప్టెంబర్ 29న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ టెండర్లు రద్దు చేయాల్సిన అవసరం లేదని బోర్డు అధికారులు పేర్కొన్నారు. పైగా ఏపీ ప్రభుత్వ ఆదేశాలు తమకు వర్తించవని తుంగభద్ర బోర్డు అధికారులు అంటున్నారు. ఈ వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Latest News