by Suryaa Desk | Sat, Nov 23, 2024, 01:19 PM
శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గార మండలం అచ్చెన్నపాలెం గ్రామానికి చెందిన దుడ్డు మోహన్ శుక్రవారం మధ్యాహ్నం 80 అడుగుల రోడ్డులో ఉన్న ఎక్సైజ్ కార్యాలయం నుంచి రాంగ్ రూట్లో వస్తూ కలెక్టరేట్ వైపు వెళ్లే అవతలి రోడ్డులోకి మలుపు తిప్పుతుండగా.. మిల్లు జంక్షన్ నుంచి 80 అడుగుల రోడ్డు వైపు వస్తూ అడ్డుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు ఆటోలు బోల్తా పడగా, రాంగ్ రూట్లో ఆటో నడుపుతూ వస్తున్న మోహన్ గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం రిమ్స్‌కి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News