by Suryaa Desk | Sat, Nov 23, 2024, 01:22 PM
ఉపాధి హామీ పథకం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపడ మే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ పథకం కేంద్ర డిప్యూటీ కార్యదర్శి ఆసిస్ గుప్తా తెలిపారు. విజయనగరం జిల్లా, రామభద్రపురం మండలంలోని కొట్టక్కి, తారాపురం, కాకర్లవలస గ్రామాల్లో చేపట్టిన ఉపాధి పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...... ఈ ఏడాది రాష్ట్రంలో ఉపాధి హామీ ద్వారా సుమారు రూ.3 వేల కోట్లతో సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణంతోపాటు భూగర్భ జలాల అభివృద్ధికి పెద్ద ఎత్తున చెక్‌డ్యాం పనులు కూడా మంజూరు చేశామని తెలిపారు. చెరువుల్లో చెక్‌డ్యాంలు, ఫీడర్ ఛానళ్లు చేపడతామని చెప్పారు. అలాగే తోటల్లో ట్రెంచెస్, పండ్ల తోటల్లో ఫారంఫాండ్స్ తవ్వకాలు జరుగుతున్నాయన్నారు.
ఈ ఏడాది నేలబావుల తవ్వకానికి కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 23 వేల గోకుల షెడ్లు నిర్మాణం చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది 26 వెల ఎకరాల్లో ఉద్యాన పంటలు పెంపకం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం స్టేట్ డైరక్టర్ షణ్ముఖ్‌కుమార్, ప్రోగ్రాం అధికారి కిరణ్ పాడి, జిల్లా డుమా పీడీ కళ్యాణచక్రవర్తి, ఏపీడీలు కిరణ్, శ్రీనివాసరావు, ఎంపీడీవో రత్నం, ఏపీవోలు గొలగాని త్రినాథరావు, విజయలకీ్క్షలు పాల్గొన్నారు.
Latest News