by Suryaa Desk | Sat, Nov 23, 2024, 01:22 PM
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దీపం -2 పథకంలో లబ్ధిపొందిన వారిసంఖ్య మూడు వారా ల్లోనే 50 లక్షల మైలురాయిని చేరుకోవడం గర్వకార ణమని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనో హర్ అన్నారు. విజయవాడ, కృష్ణలంకలో శుక్రవారం నిర్వహించిన దీపం-2 ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మనోహర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. లబ్ధిదారు ఎం.కోటేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో ముచ్చటిం చారు.
దీపావళి పండుగ రోజు సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో లాంఛనంగా ప్రారంభించిన దీపం-2 పథకం విజయవంతంగా అమలవుతోం దని మంత్రి మనోహర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.55 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కావాలనే దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గ్యాస్ కనెక్షన్ల సంఖ్యపై అవగాహన లేకుండా 1.85 కోట్ల కనెక్షన్లు అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతు న్నారన్నారు. మూడు గ్యాస్ కంపెనీలు అందించిన సమాచారం మేరకు రాష్ట్రంలో 1,55,00,200 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ పథకం అందేలా రూ.894 కోట్ల అడ్వాన్స్‌ను గ్యాస్ కంపెనీలకు అందజేశామన్నారు. దీపం-2 పథకంపై ఇప్పటివరకు 521 ఫిర్యా దులు అందాయని, కార్యక్రమం అమలులో పారదర్శకతే దీనికి నిదర్శనమని అన్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లోనే నిధులు జమ అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో పౌరసరఫ రాల కార్పొరేషన్ వీసీ, ఎండీ జి.వీరపాండ్యన్, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, ఆర్డీవో చైతన్యపాల్గొన్నారు.
Latest News