by Suryaa Desk | Sat, Nov 23, 2024, 01:39 PM
రణస్థలం పరిధిలోని బంటుపల్లి పంచాయతీ పరిధి జాతీయ రహదారికి ఆనుకొని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీశ్రీ రాధా గోకులానంద ఆశ్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆశ్రమ నిర్వాహకులు ప్రభు మహారాజ్ ఆహ్వానించారు. శుక్రవారం అమరావతిలో ఆహ్వాన పత్రాన్ని అందించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఐదు రోజులపాటు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈయనతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తదితరులు ఉన్నారు.
Latest News