by Suryaa Desk | Sat, Nov 23, 2024, 01:40 PM
సచివాలయ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించకపోతే చర్యలు తప్పవని విజయనగరం సచివాలయాల జిల్లా ప్రత్యేకాధికారి బి.రామ్గోపా ల్ హెచ్చరించారు. శుక్రవారం బలిజిపేట మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొంతమంది సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఎంపీసీఐ సర్వే అనేది కేవలం గృహాలను గుర్తించడమే కాదని, జియో ట్యాగింగ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వలసపోయిన వారి వివరాలు సేకరించాలన్నా రు. ఇంతవరకు మరుగుదొడ్లు లేని లబ్ధిదారులకు మరుగు దొడ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె.విజయలక్ష్మి, ఈవోఆర్డీ పుష్పారావు, మండలం లోని అన్ని సచివాలయాల సిబ్బంది హాజరయ్యారు.
Latest News