by Suryaa Desk | Sun, Nov 24, 2024, 10:19 AM
ప్రపంచంలోనే అత్యంత సంపద ఉన్న ధనవంతుడిగా అపర కుబేరుడిగా ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డును సృష్టించాడు. తొలిసారిగా 300 బిలియన్ల డాలర్ల మార్క్ ను తాకి, ఎలాన్ మస్క్ బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ లో తన సత్తా చాటాడు. దీంతో ప్రపంచంలో ఉన్న కొన్ని దేశ ఆర్థిక వ్యవస్థలకన్నా కూడా ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద ఎక్కువగా ఉండటం విశేషం. ఎలాన్ మస్క్ ప్రస్తుతం ఎంత ఆస్తిని కలిగి ఉన్నాడు... అందుకు దారి తీసిన కారణాలు తెలుసుకుందాం.
ఈ భూమి మీదనే అత్యధిక సంపద ఉన్న ధనవంతుడిగా ఎలాన్ మస్క్ అవతరించాడు. టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ (ట్విట్టర్) కంపెనీని అధిపతి ఎలాన్ మస్క్ తొలిసారిగా 300 బిలియన్ల సంపదను దాటిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు ప్రస్తుతం ఆయన సంపద 347 బిలియన్ డాలర్లకు చేరింది. భూమి మీద ఎలాన్ మస్క్ ధనవంతుడు ఇక ఎవరూ లేరని చెప్పుకోవచ్చు. అయితే ఆయన సక్సెస్ సీక్రెట్ మాత్రం ఇటీవల అమెరికా ఎన్నికల్లో గెలిచిన డోనాల్డ్ ట్రంప్ అని చెప్పవచ్చు ఎందుకంటే, అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఆయన సంపద దాదాపు 40 శాతం అభివృద్ధి చెందింది. ఆయన కంపెనీ షేర్లు విపరీతంగా లాభాలను పొందాయి. నిన్న ఒక్కరోజే ఎలాన్ మస్క్ సంపద ఏడు మిలియన్ బిలియన్ డాలర్లు పెరిగింది. కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అలాగే ఎలాన్ మస్క్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఎన్నికల్లో కూడా బాహాటంగానే డోనాల్డ్ ట్రంప్ కు సపోర్ట్ చేయడంతో పాటు ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా నిలబడ్డాడు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన సంపద భారతీయ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే 5.5 లక్షల కోట్లు పెరిగింది. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ లో మస్క్ తొలి స్థానంలో ఉన్నారు.
ఎలాన్ మస్క్ కంపెనీ షేర్లలో ముఖ్యంగా టెస్లా కార్ల కంపెనీ షేర్ ధర దాదాపు 40 శాతం పెరిగింది. డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ కోసం ఒక ప్రత్యేక బాధ్యతను కూడా అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ పేరిట ఎలాన్ మస్క్ కు కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనకు అమెరికా ప్రభుత్వంలో పెరగనున్న బాధ్యత కారణంగా ఆయన వ్యాపారాలు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని మధుపరులు పెద్ద ఎత్తున టెస్లా కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే కనుక కొనసాగినట్లయితే, భవిష్యత్తులో ఎలాన్ మస్క్ 1000 బిలియన్ డాలర్ల వరకూ తన సంపదను పెంచుకునే అవకాశం ఉందని. తద్వారా ఈ భూమి మీద తొలి ట్రిలియనీర్ గా ఎలాన్ మస్క్ అవతరించే అవకాశం కూడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే టెస్లా కంపెనీలో లాభాలు ఎక్కువగా అమెరికా ప్రభుత్వం అందిస్తున్న కార్బన్ క్రెడిట్స్ విక్రయించడం ద్వారా అందుతున్నాయని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఎలాన్ మస్క్ మాత్రం భవిష్యత్తులో తాను క్రిప్టో కరెన్సీ వంటి మార్కెట్లలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతానని, క్రిప్టో కరెన్సీ ద్వారా టెస్లాకారులను విక్రయిస్తానని, ఇప్పటికే ఆయన ప్రత్యక్షంగా ప్రకటించారు. దీనికి తోడు ఇప్పటికే ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ఇంటర్నెట్, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున లాభాలను పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.