by Suryaa Desk | Sun, Nov 24, 2024, 03:38 PM
అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మత్యువాత పడ్డారు, వీరంతా కూలీ పనులకు వెళ్ళొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వారికి అవసరమైన సాయం అందజేయాలన్నారు.
Latest News