by Suryaa Desk | Sun, Nov 24, 2024, 03:38 PM
విశాఖ నగరంలో పోలీసులు హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని హోటళ్లు, లాడ్జీలను గుర్తించారు. విశాఖ నగరంలోని జోన్ 1, జోన్ 2 పరిధిలో 80 బృందాలతో 270 మంది పోలీసులతో 80 హాస్టళ్లు, లాడ్జిలు, 5 మెన్ హాస్టళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 47 హోటల్స్, లాడ్జీలలో అగ్నిమాపక ఎన్వోసీలు లేవు.. 22 హోటల్స్, లాడ్జీలలో జీఎస్టీ పత్రాలు లేవని, 8 హోటల్స్, లాడ్జీలలో ట్రేడ్ లైసెన్సులు లేనట్లు పోలీసులు గుర్తించారు.
అలాగే 11 హోటల్స్, లాడ్జిలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్స్ లేవని... 5 హోటల్స్‌లో సందర్శికులకు సంబంధించి రికార్డులు మెంటైన్ చేయడం లేదని పోలీసులు పేర్కొన్నారు. మరో 36 హోటల్స్, లాడ్జీలలో లగేజ్ స్కానర్, అండర్ వెహికల్ చెక్ మిర్రర్ వంటి యాక్సెస్ లేదని, 5 హోటళ్లలో సీసీటీవీలను పర్యవేక్షించడం లేదన్నారు. హోటల్స్, లాడ్జీలలో నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ నగర సీపీ హెచ్చరించారు.
Latest News