by Suryaa Desk | Sun, Nov 24, 2024, 03:43 PM
ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా పేరొందిన తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక నాలుగో శనివారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి భారీగా భక్తజనం తరలివచ్చారు. తొలుత నాగావళి నదిలో స్నానాలు ఆచరించారు.
ఆలయంలోని క్యూలైన్లలో గంటల కొద్దీ నిరీక్షించిన అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఆలయ ప్రాంగణంలో పార్వతీపురం మండలం కొత్తపట్నం గ్రామానికి చెందిన సంతోషిమాత కోలాటం గ్రూపు సభ్యుల కోలాటం ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ, సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత ప్రసాదాలు అందించారు. అనంతరం అన్యదానం కార్యక్రమం నిర్వహించారు.
Latest News