by Suryaa Desk | Sun, Nov 24, 2024, 03:41 PM
ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే సంక్రాంతి సమయానికి ట్రేడ్ ఫెయిర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ఎంఎ్‌సఎంఈ కార్యదర్శి ఎస్‌సీఎల్ దాస్‌ను కోరినట్లు రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల శాఖ (ఎంఎ్‌సఎంఈ) మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ట్రేడ్ ఫెయిర్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చారని చెప్పారు. శనివారం, ఇక్కడ భారత మండపంలో జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లోని ఏపీ పెవిలియన్‌ను మంత్రి సందర్శించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ట్రేడ్ ఫెయిర్ ఏర్పాటు వల్ల ఎంఎ్‌సఎంఈ ఉత్పత్తులకు ప్రచారం లభిస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రతి గ్రామంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు(అంత్రప్రెన్యూర్స్)ను తయారు చేసేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్‌కల్యాణ్ నాయకత్వంలో దేశానికి మంచి భవిష్యత్తు లభిస్తుందని ప్రజలు నమ్ముతున్నారని, ఇందుకు ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. పవన్‌కల్యాణ్ ప్రచారం చేసిన ప్రతిచోటా ఎన్‌డీయే అభ్యర్థులు గెలుపొందారని మంత్రి గుర్తు చేశారు.
Latest News