by Suryaa Desk | Sun, Nov 24, 2024, 03:48 PM
శ్రీకాకుళం నగరంలో గంజాయి విక్రయిస్తున్న గూనపాలెం చెరువు గట్టు ప్రాంతానికి చెందిన లండ కుమార్‌ని శనివారం అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్.వివేకానంద తెలిపారు. ఈ వివరాలను వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. కుమార్ గత కొద్ది రోజులుగా గంజాయి రవాణా చేయడంతో పాటు పొట్లాలుగా చేసి విక్రయిస్తున్నాడనే సమాచా రంతో శ్రీకాకుళం సీఐ కె.పైడపునాయుడు ఆధ్వర్యంలో వన్‌టౌన్ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ నగరంలోని 80 అడుగుల రోడ్డులో మాటువేశారు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న కుమార్‌ను పట్టుకుని విచారించారు.
చెడు వ్యసనాలకు బానిసై, డబ్బులు సంపాదించాలన్న యావ తో ఒడిశాలోని పర్లాకిమిడి నుంచి గంజాయిని కొను గోలు చేసి నగరంలో యువకులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులకు అనుమానం రాకుండా గంజా యిని చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి విక్రయి స్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. గంజాయి ఎవరెవరికి విక్ర యించింది, ఎవరి నుంచి కొనుగోలు చేసింది తెలుసు కున్నామన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలి పారు. కుమార్ నుంచి 2.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామన్నారు. అతని తల్లిదండ్రుల అనుమతితో డి-ఎడిక్షన్ సెంటర్‌కు తరలిస్తున్నట్లు తెలి పారు. ఈ కేసులో ప్రతిభ కనబరచిన సీఐ, ఎస్‌ఐ, ఏఎస్ ఐబీ రమేష్‌బాబు, కానిస్టేబుళ్లు ఎస్.రవికుమార్, ఎన్.దుర్గారావు, వై.రమణమూర్తి, ఎం.జగదీష్, ఆర్. సూరిబాబును అభినందించారు. జిల్లాలో గంజాయి నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. నదీ పరీవాహక ప్రాంతా ల్లో గంజాయి, మత్తు పదార్థాలు సేవించే ఆనవాళ్లను డాగ్స్ ద్వారా గుర్తిస్తున్నట్లు చెప్పారు.
Latest News