by Suryaa Desk | Sun, Nov 24, 2024, 03:49 PM
మైలవరం పరిధిలోని ఎస్. వి.ఎస్.నగర్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. గృహం నడుపుతున్న ఇస్లావత్ లలితను, నూజివీడుకు చెందిన మూరుమూడి అచ్చియ్య, హరికోటి కిరణ్ ప్రకాశ్‌లను అరెస్టు చేశామని సీఐ చంద్రశేఖర్, ఎస్సై కె.సుధాకర్ తెలిపారు. ఫొటోలు వాట్సాప్‌లో పంపి విటుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. మైలవరంలో ఎవరైనా వ్యభిచార గృహం నడిపితే నంబర్లు 8332983805, 9440796447కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు పేర్కొన్నారు.
Latest News