by Suryaa Desk | Sun, Nov 24, 2024, 04:02 PM
నేరాల నియంత్రణకు పోలీసులు సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. కాకినాడ ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఆదేశాలతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరాలను అదుపుచేయాలని నిర్ణయించారు. ఇందులో భా గంగా డ్రోన్ల సహాయంతో నేరాలు జరగేందుకు అవకాశం ఉన్న శివారు ప్రాంతాలను గుర్తించారు. తోటలు, బహిరంగ ప్రదేశాలు, పార్క్‌లు, నిర్జన ప్రాంతాల్లోకి డ్రోన్స్‌ను పంపి నిఘా ఏర్పాటుచేస్తున్నా రు.
శనివారం కాకినాడ శివారు ప్రాంతాలైన ఏటిమొగ, తూరంగి, జగన్నాథపురం, పోర్ట్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టి దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న పలువురిని అరెస్ట్‌లు చేసి కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ విక్రాంత్‌పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విధానం నేరాలను మరింత కట్టడి చేయడానికి దోహదపడుతుందని ఎస్పీ తెలిపారు.
Latest News