by Suryaa Desk | Sun, Nov 24, 2024, 04:04 PM
దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతులు మంత్రిని సచివాలయంలో కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు. నిలిచిపోయిన పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని కోరారు. అందులోభాగంగా గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఆరంభించి మధ్యలో నిలచిపోయిన కోల్డ్‌స్టోరేజీ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరగా మంత్రి అచ్చెనాయుడు నిధులు విడుదల చేస్తామని స్పష్టమైన హమీ ఇచ్చినట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. నియోజకవర్గంలో అగ్రికల్చర్ ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.
Latest News