by Suryaa Desk | Sun, Nov 24, 2024, 05:21 PM
అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించామని లోక్‌సభ జనసేన ఫ్లోర్ లీడర్ బాలశౌరి తెలిపారు. విభజన సమస్యలను వేగంగా పరిష్కరించాలని ప్రస్తావించానని అన్నారు. విభజన హామీల మేరకు, ఆయిల్ రిఫైనరీ, కడప స్టీల్ ప్లాంట్. ఓడ రేవు కూడా ఏపీకి ఇవ్వాలని కోరానని చెప్పారు. పోలవరం మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించాలని అన్నారు. పునరావాసం కల్పించి రెండేళ్లలోనే నిర్మాణం పూర్తవ్వాలని అన్నారు.
పోలవరం ఎత్తును తగ్గించకుండా ప్రజల కోరుకుంటున్న రీతిలో ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలని అన్నారు. ఆహార ధాన్యాలను ఎక్కువగా పండించేందుకు కౌలు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కౌలు రైతులకు మేలు కలిగేలా, నష్చ పరిహారం.. వారికే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరానని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహరాష్ట్రలో ప్రచారం చేసిన, ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థులు గెలిచారని గుర్తుచేశారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చకు వచ్చినప్పుడు తమ అభిప్రాయాన్ని ప్రస్తావిస్తామని బాలశౌరి తెలిపారు.
Latest News