by Suryaa Desk | Sun, Nov 24, 2024, 05:22 PM
ఆల్ ఇండియా పిరికిపందుల సంఘానికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష, కార్యదర్శులు అని తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు పదవులు, డబ్బుల కోసం కక్కుర్తి పడే వ్యక్తులని విమర్శించారు. గతంలో టీడీపీ నుంచి కొడాలి నాని వెళ్లిపోవడానికి డబ్బుల డీల్ ప్రధాన కారణమని ఆక్షేపించారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారని ఆరోపించారు.మాలాంటి ఎంతో మంది జగన్ అరాచకాలకు ఎదురొడ్డి నిబడ్డారని అన్నారు.
వైసీపీ పాలనలో అధికార మదంతో కళ్లు నెత్తికెక్కి నాని, వంశీలు నోటికొచ్చినట్లు వాగారని విమర్శలు చేశారు. నిజంగా మనిషి అనే వాడు ఎవడైనా ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. వారి నోటిదూల చూసిన ప్రజలంతా చట్టప్రకారం శిక్షించాలని ప్రజలే డిమాండ్ చేస్తున్నారని అన్నారు. అసలు కొడాలి నాని, వంశీ అడ్రెస్ ఏది. ఎక్కడ ఉన్నారని నిలదీశారు. చంపేస్తాం, పొడిచేస్తామని అన్న వారంతా ఇప్పుడు ఎక్కడికి పారిపోయారని బుద్దా వెంకన్న విమర్శించారు.
Latest News