by Suryaa Desk | Sun, Nov 24, 2024, 11:03 PM
సెకీతో ఒప్పందంపై తనను అర్ధరాత్రి నిద్రలేపి సంతకం చేయమన్నారంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రియాక్టయ్యారు. బాలినేని మాట్లాడటం చూస్తుంటే.. అబద్దాలు గొప్పగా ఎలా మాట్లాడాలో చూసి నేర్చుకోవచ్చంటూ ఎద్దేవా చేశారు. సెకీ ఒప్పందం రాష్ట్రానికి చాలా ప్రయోజనం కలిగిస్తుందన్న చెవిరెడ్డి.. టీడీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే..50 శాతం తక్కువతోనే ఒప్పందం జరిగినట్లు చెప్పారు. బాలినేని వ్యాఖ్యలు ఆయన రాజకీయ స్వార్ధం కోసమేనన్న చెవిరెడ్డి.. కూటమి ప్రభుత్వంలో ఏదో ఆశించి మాట్లాడుతున్నారన్నారు. వైఎస్ జగన్ మీద ఆరోపణలు చేస్తూ బాలినేని వ్యక్తిత్వం చంపుకుంటున్నారని.. ఎమ్మెల్సీ ఇస్తారనే భ్రమలో ఉండి అలా మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు, ఎమ్మెల్సీ పదవి కోసం బాలినేని ఇప్పటికే 9 కోట్లు ఇచ్చారంటూ ప్రచారం జరుగుతోందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు.
Latest News