by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:25 AM
మాజీ సీఎం జగన్ అవినీతి రాష్ట్రానికే పరిమితం కాకుండా అమెరికా చేరిందని, తద్వారా అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జ్జించారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. అనంతపురంలో మంత్రి ఆదివారం మాట్లాడుతూ.. సెకీ ఒప్పందాలపై నామినేషన్ పద్ధతి వద్దని తాము ఆనాడే చెప్పినా అప్పటి వైసీపీ ప్రభుత్వం ఖాతరు చేయలేదన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివా్‌సరెడ్డి ఆ ఒప్పందాలపై బహిరంగంగానే మాట్లాడారని గుర్తుచేశారు.
తన ప్రమేయం లేకుండానే సెకీ ఒప్పందాలు జరిగాయంటున్నారంటే, అంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఆ ఒప్పందాలు జరిగాయన్నది స్పష్టంగా అర్థమవుతోందని మంత్రి వ్యాఖ్యానించారు. సెకీ ఒప్పందాల్లో రూ.1750 కోట్ల అవినీతి జరిగిందని, ఆ మొత్తం జగన్ జేబులోకి చేరిందని అమెరికా చెబుతోందన్నారు. ఈ అవినీతిపై సమగ్ర విచారణ చేయడంతోపాటు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లడంతోనే ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు ఆ పార్టీని వీడుతున్నారన్నారు.
Latest News