by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:25 AM
అక్రమ మార్గంలో డబ్బు సంపాదన కోసం యువతను గంజాయి మత్తులో దించి సొమ్ము చేసుకుంటున్న స్మగ్లర్లు.. పక్కా ప్రణాళికతో దానిని నగరాలకు సరఫరా చేరుస్తున్నారు. అయితే గంజాయి సాగు చేయడం దగ్గర్నుంచే వీరి ప్రమేయం ఉంటోందని పోలీసుల విచారణలో తేలింది. లంబసింగి నుంచి హైదరాబాద్‌కు రహస్యంగా గంజాయి సరఫరా చేస్తున్న అనకాపల్లికి చెందిన ఘరానా స్మగ్లర్ల ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్ న్యూ) పోలీసులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ ముఠాను పోలీసులు విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్మగ్లింగ్ ముఠా నాయకుడు బాలాజీ గోవింద్‌కు ఆంధ్రా-ఒడిసా బోర్డర్‌లోని చిత్రకొండ అటవీ ప్రాంతానికి చెందిన గంజాయి సాగు చేసే రైతులు పరిచయమయ్యారు. దీంతో గంజాయి సాగుకు పెట్టుబడి సాయం తాను చేస్తానని, పండించిన గంజాయిని తనకు కేజీ రూ.1500 చొప్పున విక్రయించాలని రైతులను కోరాడు. దాన్ని మొదట్లో ఇతర వ్యక్తులకు హోల్‌సేల్‌గా కేజీ రూ.5 వేల చొప్పున విక్రయించేవాడు. తర్వాత అతని స్నేహితులు అదిగల్లి ప్రకాశ్‌కుమార్, మసాలాల మోహన్‌రావు, రాజన దుర్గాహరిప్రసాద్, కోడి రమణ, మరో ఇద్దరు.. గోవింద్‌తో జత కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
చిత్రకొండ అటవీ ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్న రైతుల నుంచి కొనుగోలు చేసే గోవింద్ ముఠా.. దానిని అడవిలోని రహస్య మార్గాల ద్వారా కూలీల సాయంతో 20 కిలోమీటర్ల మేర కాలినడకన రవాణా సౌకర్యం ఉన్న ప్రాంతానికి తరలించేవారు. గోవింద్ ముఠా అక్కడి నుంచి గుట్టుగా లంబసింగికి తరలించి భద్రపరచుకుంటారు. వ్యాపారుల ఆర్డర్‌ను బట్టి ఎవరి వ్యాపారం వారు చేస్తుంటారు. అయితే హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటకలో డిమాండ్‌ను అమ్మేవారు. హైదరాబాద్ నగరంలో కేజీ రూ.25 వేలకు విక్రయిస్తున్నారు. ఇలా 2020 నుంచి క్వింటాళ్ల కొద్దీ విక్రయించారు.
Latest News