by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:29 AM
పుట్లూరు మండలంలోని నారాయణరెడ్డిపల్లి క్రాస్ వద్ద ఆదివారం ఎడ్లబండిని ద్విచక్రవాహనం ఢీకొనడంతో యల్లనూరు మండలం కూచివారిపల్లికి చెందిన ప్రభాకర్నాయుడు (36) అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రభాకర్నాయుడు, అదే గ్రామానికి చెందిన వెంకటేశులు ద్విచక్రవాహనంలో తాడిపత్రికి బయలుదేరారు.
నారాయణరెడ్డిపల్లి క్రాస్వద్దకు రాగానే రోడ్డు పక్క నుంచి ఉన్నట్టుండి ఎడ్లబండి రోడ్డుపైకి వచ్చింది. ద్విచక్రవాహనం అదుపు చేయలేక ఆ బండిని ఢీకొట్టారు. దీంతో ప్రభాకర్నాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశులుకు గాయాలవగా చికిత్స నిమిత్తం తాడిపత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు హరిప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హేమాద్రి తెలిపారు. మృతుడికి భార్య సాయిలత, మూడేళ్ల కుమార్తె స్నేహచౌదరి, 9నెలల కుమారుడు ఉన్నారు.
Latest News