by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:30 AM
రాప్తాడు మండలంలోని హంపాపురం సమీపంలో ఉన్న మౌనగిరి హనుమన క్షేత్రాన్ని పర్యాటకంగా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. మౌనగిరి క్షేత్రం ఏడో వార్షికోత్సవం సందర్బంగా పరిటాల కుటుంబ సభ్యులు అక్కడి ఏకశిలా ఆంజనేయస్వామి విగ్రహాన్ని దర్శించుకున్నారు.
ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటూ పరిటాల శ్రీరామ్, పరిటాల జ్ఞాన దంపతులు స్వామి వారికి పట్టు వసా్త్రలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల ను మౌనగిరి వ్యవస్థాప కులు ఈశ్వరయ్యతో కలిసి పరిశీలించారు. జాతీయ రహ దారి వద్ద నుంచి ఆలయం వరకు రోడ్డు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. టీడీపీ మండల ఇనచార్జ్ ధర్మవరపు మురళి, మండల కన్వీనర్ కొండప్ప, హం పాపురం జయప్ప, మరూరు గోపాల్, పుల్లలరేవు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Latest News