ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన చాగంటి
 

by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:50 PM

ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. సచివాలయానికి వచ్చిన చాగంటి... చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు... విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రయత్నించాలని చాగంటికి సూచించారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలని తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నైతిక విలువల పతనానికి కారణమవుతున్న అంశాల నుంచి విద్యార్థులు, యువతను దూరంగా మళ్లించాలని సూచించారు. ఈ భేటీ సందర్భంగా చంద్రబాబు... చాగంటికి శాలువా కప్పి, వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. కాగా, చాగంటి కోటేశ్వరరావు ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను కూడా కలిశారు.

Latest News
Centre completes auction of 9 coal mines, to yield Rs 1,446 crore annual revenue Wed, Nov 27, 2024, 02:59 PM
Bumrah reclaims top spot as Test bowler, Jaiswal attains career-best 2nd place in batter's list Wed, Nov 27, 2024, 02:53 PM
People picked bones out of a comment: Head quashes rumours of cracks in Australian Test team Wed, Nov 27, 2024, 02:28 PM
Pakistan’s Ahmed Daniyal, Shahnawaz Dahani ruled out of Zimbabwe ODIs Wed, Nov 27, 2024, 02:25 PM
Protests in Tripura against Hindu priest's arrest in Bangladesh Wed, Nov 27, 2024, 02:15 PM