by Suryaa Desk | Mon, Nov 25, 2024, 07:52 PM
ఏపీలో సోలార్ విద్యుదుత్పత్తి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'సూర్య ఘర్' పథకం గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇల్లు, ప్రతి ఆఫీసు సౌర విద్యుదుత్పత్తి కేంద్రంగా మారాలని అన్నారు. సౌర విద్యుత్ విధానంలో... గృహ అవసరాలకు సరిపోగా, మిగిలిన విద్యుత్ ను డిస్కంలకు విక్రయించవచ్చని, తద్వారా అదనంగా ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలు గరిష్ఠ లబ్ధి పొందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోలార్ విలేజ్ పైలట్ ప్రాజెక్టుగా కుప్పం నేటి సమీక్షలో సోలార్ విలేజ్ అంశం కూడా సమీక్షకు వచ్చింది. 100 శాతం సోలార్ విద్యుత్ సరఫరాకు పైలట్ ప్రాజెక్టుగా సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంను ఎంపిక చేశారు.
Latest News