రెండో పెళ్లికి రూ.5 వేల కోట్లు ఖర్చంటూ ప్రచారం.. స్పందించిన జెఫ్ బెజోస్
 

by Suryaa Desk | Mon, Dec 23, 2024, 08:55 PM

అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్‌ బెజోస్‌ రెండో పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. తన ప్రియురాలు లారెన్‌ శాంచెజ్‌ తో ఈ నెల 28న ఈ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో పెళ్లికి చేసే ఖర్చు గురించి మీడియాలో ముమ్మర ప్రచారం జరుగుతోంది. ఏకంగా 600 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ. 5 వేలు) ఖర్చు చేయనున్నారని ప్రచారం చేస్తున్నారు. తాజాగా, ఈ ప్రచారంపై జెఫ్ బెజోస్ స్పందించారు. అందులో ఏమాత్రం నిజం లేదు, ఇదంతా తప్పుడు ప్రచారమని ఆయన ఖండించారు. ‘‘ఇది నిజం కాదు... పెళ్లికొచ్చే అతిథులు ప్రతి ఒక్కరికి ఒక్కో ఇంటిని బహుమతిగా చేస్తే తప్ప ఇంత మొత్తం ఖర్చు చేయలేరు.. మీరు చదివేవన్నీ నమ్మొద్దు..’’ అని ఎక్స్‌లో వెల్లడించారు.


 ‘‘నిజం మనల్ని చేరకముందే అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టుముడతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి... తప్పుడు నివేదికలను ప్రచురించే మీడియా. మళ్లీ తిరిగి నిజం గురించి వార్తలు రాయడం ఆసక్తికరంగా ఉంటుంది.’’ అని బిల్ అక్‌మన్ ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చారు. కాగా, లారెన్ శాంచెజ్‌తో బెజోస్‌కు గతేడాది నిశ్చితార్థం జరిగింది. కొలరాడోలోని ఆస్పెన్‌‌లో సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో డిసెంబరు 28న వీరి వివాహం జరగనుంది.


ఈ వివాహానికి మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, లియోనార్డో డికాప్రియో, జోర్డాన్‌ రాణి రానియా వంటి ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. దాదాపు 180 మంది పాల్గొనే ఈ వివాహం కోసం విలాసవంతమైన రెస్టారెంట్‌ను అద్దెకు తీసుకున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. గెస్ట్‌‌ల కోసం లగ్జరీ హోటల్స్‌, ప్రైవేటు విల్లాలను ముందస్తు బుకింగ్‌ చేసినట్లు సమాచారం.


జెఫ్‌ బెజోస్‌, లారెన్‌లు 2018 నుంచే డేటింగ్‌లో ఉండగా.. 2019లో వెలుగులోకి వచ్చింది. దీంతో తన భార్య మెకంజీ స్కాట్‌తో విడాకులు తీసుకున్నారు. మెకంజీతో ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు. గతేడాది మే నెలలో జరిగిన నిశ్చితార్థం సందర్భంగా 2.5 మిలియన్‌ డాలర్ల విలువైన పింక్ డైమండ్ ఉంగరాన్ని శాంచెజ్‌కు బెజోస్‌ ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. గతంలో జర్నలిస్ట్‌గా పనిచేసిన 54 ఏళ్ల లారెన్‌.. ప్రస్తుతం దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ది వ్యూ, కేటీ టీవీ, ఫాక్స్ 11 వంటి ప్రముఖ అంతర్జాతీయ ఛానెల్స్‌లో రిపోర్టర్‌గానూ, న్యూస్ ప్రజెంటర్‌గా శాంచెజ్ పనిచేశారు. ఆమెకు గతంలో పాట్రిక్ వైట్‌సెల్ అనే వ్యక్తితో పెళ్లి జరగ్గా.. ఆ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ ఆటగాడు టోనీ గోంజలెజ్‌తోనూ ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే జెఫ్ బెజోస్‌కు ఇది రెండో పెళ్లి కాగా.. లారెన్ శాంచెజ్‌కు మాత్రం మూడో వివాహం.

Latest News
PM Modi Commissions Three Naval Combatants: INS Surat, Nilgiri, Vaghsheer Wed, Jan 15, 2025, 11:52 AM
Bengal 'expired' saline death case: Autopsy report hints at multi-organ failure Wed, Jan 15, 2025, 11:50 AM
AU to convene annual summit to elect senior leadership Wed, Jan 15, 2025, 11:48 AM
Yemen's Houthis claim missile attack on power plant in Israel Wed, Jan 15, 2025, 11:44 AM
77th Army Day: Leaders Salute Brave Soldiers and Their Sacrifices Wed, Jan 15, 2025, 11:42 AM