రూ.1 లక్ష ఉంటే చాలు.. మస్త్ సంపాదించుకోవచ్చు
 

by Suryaa Desk | Mon, Dec 23, 2024, 10:01 PM

చాలా మందిగి సొంతంగా బిజినెస్ చేయాలనే కోరిక ఉంటుంది. అయితే, కుటుంబ అవసరాలు, తగ్గినంత పెట్టుబడి లేకపోడవం, వ్యాపారాలపై సరైన అవగాహన లేకపోవడం వంటి వివిధ కారణాలతో వెనకడుగు వేస్తుంటారు. సాధారణంగా ఒక బిజినెస్ మొదలు పెట్టాలంటే లక్షల రూపాయల పెట్టుబడి అవసరమవుతుందని భయపడే వారే చాలా మంది ఉంటారు. కానీ, తక్కువ పెట్టుబడితోనూ తమ సామర్థ్యాలకు తగిన విధంగా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. మీ దగ్గర ఉన్న రూ.1 లక్ష బడ్జెట్‌లోనే ఎలాంటి బిజినెస్ మొదలు పెట్టవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.


కేఫ్ బిజినెస్..


రూ.1 లక్ష లోపు బడ్జెట్‌లో ప్రారంభించగల వ్యాపారాల్లో కేఫ్ బిజినెస్ ఒకటి. తక్కువ ఖర్చుతో మీరు ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. మొదటగా స్థిర వ్యయాలను తగ్గించుకునేందుకు సెల్ఫ్ సర్వీస్ ఆఫర్ చేయవచ్చు. దీని ద్వారా సర్వర్ల జీతాల ఖర్చు తగ్గుతుంది.


ఫుడ్ వ్యాన్ బిజినెస్..


ఫుడ్ ట్రక్స్ ఇప్పుడు పాపులర్ అవుతున్నాయి. ప్రధానంగా నేటి తరం యువత వీటిని ఎక్కువగా ఆదరిస్తున్నారు. మీరు రూ.1 లక్ష లోపు పెట్టుబడితో బిజినెస్ చేయాలని ఆలోచిస్తుంటే ఫుడ్ వ్యాన్ బిజినెస్ లేదా ఫుడ్ ట్రక్ బిజినెస్ అనేది ఒక మంచి ఐడియాగా చెప్పవచ్చు.


చిన్న పిల్లల డే కేర్ సర్వీసెస్


ప్రస్తుత రోజుల్లో మంచి డే కేర్ సెంటర్లకు హై డిమాండ్ ఉంది. అందుకే రూ.1 లక్ష లోపు బిజినెస్‌తో చిన్నారుల కోసం డే కేర్ సెంటర్ తెరవడమనేది ఒక మంచి ఐడియాగా చెప్పవచ్చు. ఇందుకు మీకు కావాల్సింది సరిపడ స్థలం, డే కేర్ కోసం లైసెన్స్, పిల్లల భద్రత, రక్షణ కోసం ఉండాల్సిన బేసిక్ ఫెసిలిటీలు కలిగి ఉండాలి. దాంతో పాటు కొంత ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది.


ఫుడ్ కేటరింగ్ బిజినెస్..


మీరు తక్కువ బడ్జెట్లో అంటే ఫుడ్ కేటరిగి బిజినెస్ పరిశీలించవచ్చు. దీనిని మీరు ఇంటి నుంచే లేదా ఏదైనా కిచెన్ రెంటుకు తీసుకుని నడిపించవచ్చు. అలాగే మీరు జొమాటో, స్విగ్గీ వంటి యాప్స్ ద్వారానూ ఆర్డర్లు పొందవచ్చు. అలాగే బెసిక్ సప్లైతో పార్టీ ఆర్డర్లు తీసుకోవచ్చు. కిచెన్ తో పాటు కొంత ప్రచారం చేసుకోవడం అనేది స్మార్ట్ ఐడియాగా చెప్పవచ్చు.


ఫ్లవర్ షాప్ బిజినెస్..


మీరు రూ.1 లక్ష లోపు బడ్జెట్‌లో బిజినెస్ చేయాలనుకుంటుంటే మీకు పూల దుకాణం బిజినెస్ ఒక మంచి ఆలోచనగా చెప్పవచ్చు. ఫ్లవర్ షాపులకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. మంచి లాభాలు సైతం వస్తాయి. మీరు నేరుగా రైతుల నుంచే పూలు కొనుగోలు చేయవచ్చు. లేదా వోల్ సేల్ మార్కెట్ల నుంచి తీసుకోవచ్చు.

Latest News
'DK Boss' real beneficiary of Nitish Kumar's Pragati Yatra: Tejashwi Yadav Thu, Jan 16, 2025, 04:51 PM
Rahul Gandhi should apologise for his 'anti-national' remark: MP CM Thu, Jan 16, 2025, 04:36 PM
U19 Women's T20 World Cup is a game-changer for women's cricket, says Julia Price Thu, Jan 16, 2025, 04:35 PM
CM to take final call on CBI probe into former minister's murder case: Odisha Law Minister Thu, Jan 16, 2025, 04:33 PM
Indian stock market ends higher, Adani Ports among top gainers Thu, Jan 16, 2025, 04:29 PM