సిప్ మ్యాజిక్.. నెలకు రూ. 10 వేలు ఆదా.. కొన్నేళ్లలోనే చేతికి రూ. 13 కోట్లు వచ్చాయ్!
 

by Suryaa Desk | Mon, Dec 23, 2024, 09:59 PM

మ్యూచువల్ ఫండ్స్.. అనేది దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ పొందేందుకు అందుబాటులో ఉన్న బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రిస్క్ ఉన్నా కూడా మంచి పథకాల్ని ఎంచుకొని ఇన్వెస్ట్ చేస్తే.. మంచి లాభాల్ని అందుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. ఇక్కడ ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా నెలనెలా మదుపు చేయొచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి కంటే.. నెలనెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఇంకా ఇక్కడ మీ అవసరాల్ని బట్టి ప్రారంభంలో కొద్ది మొత్తంలో ప్రారంభించినా.. కాలం గడుస్తున్న కొద్దీ ఏటా కొంత శాతం పెంచుకుంటూ పోతే తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో కూడబెట్టేందుకు అవకాశం ఉంటుంది.


కాంపౌండింగ్ ఎఫెక్ట్ కారణంగా స్వల్పకాలంలో కంటే.. లాంగ్ రన్‌లో అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందుకోవచ్చు. చక్రవడ్డీతో ఏటా సంపద పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. ఇప్పుడు ఇలాగే నెలకు రూ. 10 వేల సిప్‌ చేసిన వారికి ఒక స్కీమ్.. కొన్ని సంవత్సరాల్లో కళ్లు చెదిరే రిటర్న్స్ ఇచ్చింది. దీని గురించి తెలుసుకుందాం. ఇదే ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ ఫండ్. ప్రతి నెలా రూ. 10 వేల మొత్తం సిప్ చేస్తే.. మొత్తం 30 ఏళ్లలో చేతికి రూ. 13 కోట్ల వరకు వచ్చింది. ఈ ఫ్లాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ .. లార్జ్ క్యాప్ ఫండ్. డిసెంబర్ 1 నాటికి ఇది 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ స్కీమ్ ప్రారంభం నుంచి చూస్తే సగటున 19.21 శాతం చొప్పున రిటర్న్స్ అందించింది. గత 20 ఏళ్లలో 14.85 శాతం రాబడి ఇచ్చింది. గత పదేళ్లలో చూస్తే 11.34 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఏడాది వ్యవధిలో అయితే 19.57 శాతం వృద్ధి నమోదు చేసింది.


పథకం ప్రారంభమైన సంవత్సరం నుంచి చూస్తే.. వార్షిక ప్రాతిపదికన 18.30 శాతం చొప్పున రూ. 10 వేల సిప్‌ను రూ. 13.13 కోట్లుగా మలిచింది. గత ఐదేళ్లలో చూస్తే రూ. 10 వేల సిప్‌తో 17.58 శాతం రిటర్న్స్ లెక్కన రూ. 9.26 లక్షలు అందాయి. ఇదే సమయంలో స్కీం ప్రారంభమైనప్పుడు.. ఒకేసారి రూ. లక్ష ఇన్వెస్ట్ చేసినవారికి ఇప్పుడు రూ. 2.35 కోట్ల సంపద చేకూరింది. వార్షికంగా ఇక్కడ 19.21 శాతం రిటర్న్స్ వచ్చాయి. గత ఐదేళ్లలో చూస్తే లక్ష పెట్టుబడికి రూ. 2.07 లక్షలు వచ్చాయి. ఈ స్కీమ్ 1993 డిసెంబరులో ప్రారంభమైంది. 2024, నవంబర్ నాటికి నికర ఆస్తుల విలువ రూ. 7847 కోట్లుగా ఉంది.

Latest News
Internet users to surpass 900 million in India this year, AI a game changer Thu, Jan 16, 2025, 02:16 PM
UN agencies welcome Gaza ceasefire amid frustration in aid delivery Thu, Jan 16, 2025, 02:13 PM
Barca, Atletico Madrid cruise into Copa del Rey quarterfinals Thu, Jan 16, 2025, 01:55 PM
Haven't seen a captain like Rohit; lucky to start under him, says Akash Deep Thu, Jan 16, 2025, 01:51 PM
Jharkhand HC directs municipal polls to be held in four months Thu, Jan 16, 2025, 01:24 PM