ఇటుక బట్టీ గోడ కూలి నలుగురు చిన్నారులు మృతి.. నిద్రిస్తుండగానే ప్రమాదం!
 

by Suryaa Desk | Mon, Dec 23, 2024, 10:14 PM

మనం ఎక్కడకు వెళ్లినా.. చిన్న చిన్న పిల్లలను వెంటబెట్టుకుని మరీ వచ్చి పనులు చేసుకునే వాళ్లు చాలా మంది కనిపిస్తారు. రోజూ మూడు పూటలు తినేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి మరీ కూలీలుగా పని చేస్తుంటారు. అలాగే వచ్చారు యూపీకి చెందిన కొందరు కూలీలు కూడా. తమ చిన్నారులను వెంట బెట్టుకుని మరీ వచ్చి ఇటుక బట్టీల్లో పని చేస్తున్నారు. పక్కనే గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తుండగా.. అర్ధరాత్రి గోడ కూలింది. ఈ ప్రమాదంలో నిద్రలో ఉన్న నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఉత్తర ప్రదేశ్ బాధవ్ గ్రామానికి చెందిన 25 మంది తమ కుటుంబ సభ్యులను తీసుకుని మరీ కూలీ పని కోసం హర్యానాకు వచ్చారు. చిమ్నీ సమీపంలో అనేక నిర్మాణ పనులు సాగుతుండగా... వాటిల్లో పని చేస్తున్నారు. అలాగే హిసార్ జిల్లా బుడానా గ్రామంలో ఉన్న ఇటుక బట్టీల్లో కూడా పని చేస్తున్నారు. అక్కడే పనులు చేసుకుంటూ.. పక్కనే గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. పొద్దంతా పెద్దలు పనులు చేసుకుంటుండగా.. చిన్నారులు అక్కడే ఆడుకుంటూ ఉంటారు. ఆడి ఆడి అలిసిన వాళ్లతో పాటు వాళ్ల తల్లిదండ్రులు పని చేసి వచ్చి రాత్రిళ్లు హాయిగా పడుకుంటారు.


అసలే చలి కాలం కావడం.. అందోలనూ నిర్మానుష్య ప్రదేశాల్లో చిన్న గుడిసెలు వేసుకోవడంతో మరింత చలేసి త్వరగా పడుకున్నారా కార్మికులు. ఇటుక బట్టీలకు కాస్త దగ్గరగా ఉంటే కాస్త వెచ్చగా ఉంటుందని.. పక్కనే గుడిసెలు నిర్మించుకున్నారు. ఇదే వారు చేసిన తప్పు అయింది. అంతా హాయిగా నిద్రిస్తున్న సమయంలో ఇటుక బట్టీ గోడ కూలిపోయింది. అయితే గోడకూలిన విషయం గుర్తించిన స్థానికులు గోడ కింద ఉన్న పిల్లలతో పాటు.. గాయాలపాలైన వారిని బయటకు తీశారు.


ఈ ప్రమాదంలో 9 ఏళ్ల సూరజ్, 9 సంవత్సరాల వివేక్, 5 ఏళ్ల నందిని అక్కడికక్కడే చనిపోయినట్లు గుర్తించారు. అలాగే 3 నెలల బుజ్జాయి నిషా ప్రాణాలుకొన ప్రాణాల మధ్య ఉండగా.. ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా ప్రాణాలు కోల్పోయింది. అంతేకాకుండా మరో 5 ఏళ్ల చిన్నారి గౌరీ కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఈమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరో ఇద్దరు పెద్దవాళ్లు కూడా ఈ ఘటనలో గాయాల పాలైనట్లు సమాచారం. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News
Ethiopia repatriates 33,000 nationals over 6 months: Spokesperson Fri, Jan 17, 2025, 11:21 AM
Senior UN official calls for investment in rule of law in Lebanon Fri, Jan 17, 2025, 10:51 AM
Apple Store app arrives in India to help customers with personalised shopping Fri, Jan 17, 2025, 10:48 AM
Four killed as bus rams into stationary truck in Andhra Pradesh's Chittoor Fri, Jan 17, 2025, 10:45 AM
Bihar: Four cops arrested in Patna for storing liquor bottles Fri, Jan 17, 2025, 10:34 AM