వీళ్లు పుట్టగొడుగులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు
 

by Suryaa Desk | Mon, Dec 23, 2024, 10:58 PM

ఒకప్పటితో పోలీస్తే పుట్టగొడుగులను తినే ట్రెండ్ బాగా పెరిగింది. ఈ రోజుల్లో చాలా మంది మష్రూమ్స్‌ను ఇష్టంగా తింటారు. పుట్టగొడుగుల కూర, బిర్యానీ, మష్రూమ్ పెప్పర్ ఫ్రై, మష్రూమ్ మంచురియా ఇలా రకరకాల వంటకాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది పుట్టగొడుగుల్ని తమ ఫేవరేట్ ఫుట్స్‌లోకి చేర్చుకున్నారు. చికెన్, మటన్ ఇష్టపడని వారు వాటి స్థానంలో పుట్టగొడుగుల్ని తింటున్నారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ.. కొందరు మాత్రం వీటిని తినకూడదు.


పుట్టగొడుగులతో ప్రయోజనాలు..


పుట్టగొడుగుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి విటమిన్ డి యొక్క మంచి మూలం. వీటిని రోజూ తింటే ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు చాలా బలంగా మారతాయి. వీటిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది. పుట్టగొడుగుల్లో ఉండే పొటాషియం, సోడియం నిష్పత్తిగా తక్కువగా ఉంది. దీంతో బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. పుట్టగొడుగుల్లో సెలినీయం ఉంది. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. రోజూ తింటే మెదడు సామర్థ్యం పెరుగుతుంది. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వీటిని అస్సలు తినకూడదు.


అలెర్జీ సమస్యలు..


పుట్టగొడుగులను తినడం వల్ల కొంతమందికి చర్మ అలెర్జీ సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికే అలెర్జీ, శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు పుట్టగొడుగుల్ని ఎక్కువగా తినకూడదు. వీళ్లు పుట్టగొడుగులు తింటే చర్మంపై దద్దుర్లు, చికాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాదు పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కు నుంచి రక్తం కారడం, ముక్కు పొడిబారడం, గొంతు పొడిబారడం వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే అలెర్జీ సమస్యలు ఉన్నవారు పుట్టగొడుగుల జోలికి పోకూడదు.


తలనొప్పి..


కొందరు తలనొప్పి సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు పుట్టగొడుగుల్ని తినకపోవడమే మేలు. ఇలాంటి వారు పుట్టగొడుగుల్ని ఎక్కువగా తింటే తలనొప్పి సమస్య ఎదుర్కోవాలి. అంతేకాకుండా చిరాకు, తల మొత్తం భారంగా ఉంటుంది. అంతేకాకుండా ఏ పని కూడా చేయలేరు. ఏకాగ్రత కోల్పోతారు. అందుకే తలనొప్పి సమస్య ఉన్నవారు పుట్టగొడుగుల్ని తినకపోవడమే మేలు అంటున్నారు నిపుణులు.


జీర్ణ సమస్యలు..


చాలా మందికి అజీర్తి, ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్ వంటి సమస్యలు తరుచుగా వస్తూంటాయి. ఇలాంటి వారు పుట్టగొడుగుల్లని ఎక్కువగా తినకపోవడమే బెస్ట్. వీళ్లు పొరపాటున పుట్టగొడుగులను తింటే.. విరేచనాలు, వికారం, వాంతులు వంటి కడుపు సమస్యలు వస్తాయి. అందుకే కొంతమందికి పుట్టగొడుగులు తిన్న వెంటనే విరేచనాలు ప్రారంభమవుతాయి. జీర్ణసమస్యలు ఉన్నవారు వీటిని తినకపోవడమే మేలు. ఇది అస్సలు వారికి పడదు.


ఆందోళన సమస్యలు..


ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాళ్లు అస్సలు పుట్టగొడుగులు తినకూడుదు. మీరు పొరపాటున మష్రూమ్స్ తింటే భయం, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు మరింతగా ఎదుర్కొంటారు. ఇది మీ ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే వీటిలో సిలోసిన్, సైలోసిబిన్ కంటెంట్ ఉంటుంది. ఇవి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.


గర్బిణీ స్త్రీలు..


గర్బిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు కూడా వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. పుట్టగొడుగులు బిడ్డ లేదా తల్లి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు చూపించే అవకాశం ఉంది. ఒకవేళ మీరు తినాలనుకుంటే వైద్యుణ్ని సంప్రదించి తినడం మేలు అని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా మార్కెట్లో అనేక రకాలు పుట్టగొడుగులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని ఆరోగ్యానికి హానికరం. అందుకే వీటిని కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యానికి హానిచేసే పుట్టగొడుగుల్ని గుర్తించి వాటిని కొనకపోవడమే ఉత్తమం.

Latest News
MoS Harsh Malhotra slams Kejriwal's last-minute Metro fare subsidy proposal, calls him 'frustrated' Fri, Jan 17, 2025, 04:53 PM
U19 World Cup: Objective is to win and successfully defend the title, says Niki Prasad Fri, Jan 17, 2025, 04:45 PM
Law & order deteriorated in Karnataka due to appeasement politics: Vijayendra Fri, Jan 17, 2025, 04:41 PM
Indian stock market ends lower after 3-day gains, Nifty below 23,250 Fri, Jan 17, 2025, 04:32 PM
Israel PM Netanyahu chairs crucial cabinet meet to greenlight Gaza hostage deal Fri, Jan 17, 2025, 04:31 PM