పిల్లలు అదేపనిగా దగ్గుతున్నారా.. ఓ టీస్పూన్ దీనిని తాగిస్తే దగ్గు మాయం
 

by Suryaa Desk | Mon, Dec 23, 2024, 11:01 PM

మనకి సమస్య ఏదైనా వస్తే తట్టుకోగలం. అదే మన పిల్లలకి సమస్య వస్తే అస్సలు తట్టుకోలేం. వాళ్లకి దగ్గు, జలుబు వంటి సమస్యలొస్తే త్వరగా తగ్గవు. ఈ సమస్యని తగ్గించుకునేందుకు ట్యాబ్లెట్స్, సిరప్స్ వాడతారు. అలా కాకుండా నేచురల్‌గా తగ్గించుకోవాలంటే కొన్ని ఇంటి చిట్కాలు హెల్ప్ చేస్తాయి. అయితే, ఈ టిప్స్ ఫాలో అయినా సమస్య తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ని కలవాలని గుర్తుంచుకోండి.


తేనె..


తేనె కూడా చిన్న పిల్లలకి చాలా మంచిది. ఇది పిల్లలకి పడుకునే ముందు కాస్తా పట్టించి పడుకోబెట్టండి. దీంతో గొంతులోని గరగరని తగ్గించి దగ్గుని దూరం చేస్తుంది. టీస్పూన్‌లో సగం, టీ స్పూన్ పరిమాణంలో తేనెని పిల్లలకి ఇవ్వడం వల్ల గొంతు సమస్యలు తగ్గి దగ్గు కూడా తగ్గుతుంది.


అల్లం రసంతో తేనె..


ఇక తేనెకి అల్లం రసంని జోడిస్తే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. సగం టీ స్పూన్ పరిమాణంలో అల్లం రసం తీసుకోండి. దీనికి కొద్దిగా తేనె కలపండి. దీనిని తాగడం వల్ల దగ్గు తగ్గుతుంది. అయితే, ఎక్కువ మోతాదు వద్దు.


పసుపు, పాలు..


​పాలలో పసుపు వేసుకుని తాగితే జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయని చాలా మందికి తెలిసి ఉంటుంది. ఈ టిప్‌ని అందరూ ఫాలో అవుతారు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి బాడీలోని ఇన్ఫెక్షన్స్‌తో పోరాడుతాయి. జలుబు, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఆ సమస్యలు లేకపోయినా వారానికి రెండు సార్లు పిల్లలకి పసుపు పాలు ఇస్తే ఆరోగ్యంగా ఉంటారు.


హ్యుమిడిఫైయర్..


తేమ ఎక్కువగా ఉండడం వల్ల కూడా దగ్గు వస్తుంది. కాబట్టి, పిల్లలు ఉండే చోట తేమగా లేకుండా చూసుకోండి. వీలైతే వారు ఉండే రూమ్‌లో హ్యుమిడిఫైయర్ ఉండేలా చూసుకోండి. దీని వల్ల రూమ్‌లోని తేమ మొత్తం తగ్గుతుంది. దగ్గుకూడా తగ్గుతుంది. అయితే, దీనిని సరిగా మెంటెయిన్ చేయాలి. లేదంటే సమస్య ఎక్కువవుతుంది.


కారణాలు కనుక్కోవడం..


అయితే, సమస్య వచ్చాక టిప్స్ వాడే బదులు.. రాకముందే జాగ్రత్త పడడం మంచిది. వారికి దగ్గు ఎందుకు వస్తుందో గుర్తించండి.. పొగాకు పొగ, అలర్జీ, చల్లని నీరు, ఐస్‌క్రీమ్స్, చాక్లెట్స్ ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. కాబట్టి, ఈ కారణాన్ని గుర్తించి వాటికి దూరంగా ఉంచండి. దీని వల్ల పిల్లల దగ్గుని తగ్గించొచ్చు.


Latest News
Africa CDC Warns of Rising Disease Outbreaks in 2024, Urges Urgent Action Sat, Jan 18, 2025, 12:07 PM
Piyush Goyal to visit Brussels to discuss India-EU FTA, boost trade ties Sat, Jan 18, 2025, 12:06 PM
Auto component sector should build EV ecosystem before others catch up: Piyush Goyal Sat, Jan 18, 2025, 12:03 PM
RG Kar verdict: Tight security in Kolkata court; parents appeal to people not to end stir for justice Sat, Jan 18, 2025, 12:02 PM
Aus Open: Swiatek eases past Raducanu into Round of 16 Sat, Jan 18, 2025, 11:52 AM