by Suryaa Desk | Tue, Dec 24, 2024, 01:39 PM
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను తీవ్రంగా అవమానించిన పార్టీ కాంగ్రెస్సేనని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి విమర్శించారు.రెండు సార్లు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్‌లో అడుగు పెట్టకుండా ఆయన్ను మానసిక క్షోభకు గురిచేశారన్నారు. రాజమహేంద్రవరంలో మీడియాతో పురందేశ్వరి మాట్లాడారు.వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో అంబేడ్కర్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించామని గుర్తుచేశారు. అంబేడ్కర్, రాజ్యాంగాన్ని గౌరవించింది భాజపా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో 25 లక్షలకు పైగా భాజపా సభ్యత్వాలు నమోదవుతున్నాయని చెప్పారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పూర్తి విచారణ జరగాల్సి ఉందని.. అక్కడ మరింత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు.
Latest News