by Suryaa Desk | Tue, Dec 24, 2024, 02:54 PM
అధికార పక్షం టీడీపీపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని లేకుండా చేసేందుకు టీడీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తమ హయాంలో ఇలా వ్యవహరించలేదని అన్నారు. నాలుగేళ్ల తరువాత తాము అధికారంలోకి వస్తే అప్పుడు పార్టీ నేతలు తమ మాట వినకపోవచ్చని అన్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ కేసుల్లో అరెస్టై 4 నెలలు అవుతోంది. ఆధారాలు లేకుండా ఆయనపై కేసులు పెట్టారు. ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించలేదు. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు. జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు. డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి కుమారుడే ఫోన్ చేసి సురేష్‌ను ఎలా ఉంచాలో చెబుతున్నారు.
ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం.వైసీపీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. 30 ఏళ్ళ క్రితం నక్సలైట్లును అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి. కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్త కొత్త పద్దతులు ఉపయోగిస్తోంది. మీ కంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైసీపీకి ఉంది. నాలుగేళ్ళల్లో మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా వినే పరిస్థితి ఉండదు’’ ఆయన అని అన్నారు.
Latest News