by Suryaa Desk | Tue, Dec 24, 2024, 02:54 PM
గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మిస్సైన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్ట్‌లో మంగళవారం విచారణ జరిగింది. విచారణకు హాజరుకావాలంటూ మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పేర్నినాని, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారించింది. అయితే ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని న్యాయమూర్తి గుర్తుచేశారు. గడువు ముగిసిన నేపథ్యంలో పిటిషన్ విచారణపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని, తిరిగి పోలీసులు నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలని న్యాయస్థానాన్ని న్యాయవాదులు అభ్యర్థించారు.
అందుకు న్యాయమూర్తి అంగీకారం తెలిపారు. మచిలీపట్నంలో వైసీపీ నేత పేర్నినాని సతీమణి జయసుధ మచిలీపట్నంలోని తన గోడౌన్‌ను పౌరసరఫరాలశాఖకు లీజుకిచ్చారు. అయితే ఇందులో నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయం అయ్యాయని పేర్కొంటూ చింతం కోటిరెడ్డి అనే అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News