by Suryaa Desk | Tue, Dec 24, 2024, 02:55 PM
చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. పెనుమూరు మండలం గుంటిపల్లి గ్రామానికి చెందిన మోహనా చారి (45) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు మోహనాచారి తీసిని సెల్పీ వీడియో వైరల్‌గా మారింది. తన ఆత్మహత్యకు కారణాలు అందులో వివరించాడు. తన భార్యను ట్రాప్ చేశారని.. ఆమెను కూడా శిక్షించాలి అంటూ వీడియోలో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం మోహనాచారి బలవన్మరణానికి పాల్పడ్డాడు.గ్రామానికి చెందిన మోహనాచారికి భార్య, కుమారుడు ఉన్నాడు. అయితే తన భార్యను సచివాలయంకు చెందిన ఓ ఉద్యోగి ట్రాప్ చేశాడంటూ మోహనాచారి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు గుంటీపల్లి సచివాలయంకు చెందిన ఉద్యోగి కారణం అంటూ బాధితుడు సెల్పీ వీడియోలో తెలిపాడు.
‘‘నా భార్యను సచివాలయ ఉద్యోగి ట్రాప్ చేసి నాకు దూరం చేశాడు. వారిద్దరిని శిక్షించాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినతి చేస్తూ’’ పలువురికి మోహనాచారి వీడియో కాల్ చేసి ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ‘‘ఆ ఉద్యోగితో పాటు నా భార్యను శిక్షించండి. నా 8 ఏళ్ల కుమారున్ని కాపాడండి’’ అంటూ వీడియో కాల్ ద్వారా సీఎం, డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశాడు బాధితుడు. అనంతరం గ్రామ సమీపంలో ఉన్న క్వారీలో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. క్వారీలో దూకడంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మోహనా చారి మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సెల్ఫీ సూసైడ్‌పై కేసు నమోదు చేశారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Latest News