by Suryaa Desk | Tue, Dec 24, 2024, 03:01 PM
రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను కేంద్ర మంత్రి వర్గం నుంచి తొలగించాలని సీపీఎం కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పత్తికొండ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ సర్కిల్‌లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, ధర్నా చేశారు. దస్తగిరి, గంగన్న, రామాంజనేయులు, రమేష్ పాల్గొన్నారు.
అలానే పార్లమెంటు సాక్షిగా అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను బర్తరఫ్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు తిక్కప్ప డిమాండ్ చేశారు. ఈరన్న, నాగేంద్ర, హుసేని, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Latest News