by Suryaa Desk | Tue, Dec 24, 2024, 03:03 PM
గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే విధానం వల్ల ఎంతో మంది రైతు లు ఇబ్బందిపడుతున్నారని, వాటిని సరిచేయ కుండా నిర్లక్ష్యంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమదాలవలస తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే రవికుమార్ తహసీ ల్దార్ కార్యాలయాలకు వస్తున్న సమయంలో బూర్జ మండలం ద్వారకవలస గ్రామానికి చెందిన ధర్మవరపు ఆదిలక్ష్మి అనే వికలాంగురాలు ఆయన్ని కలిసి తన సమస్యను వివరించింది.
తన భూమిని రీసర్వే నిర్వహించిన అధికారులు ఇతరుల పేరున నమోదు చేశారని, పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించి ఆయన వెంటనే సంబంధిత వీఆర్‌వోతో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే ఈ సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వ హించిన ప్రజాదర్బార్‌లో నియోజకవర్గానికి చెందిన పలువురు రెవెన్యూ సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలు ఇచ్చారు. కార్య క్రమంలో తహసీల్దార్ ఎస్.రాంబాబు, ఆర్‌ఐ పి.గోవిందరావు, మండల సర్వేయర్ బి.గోపి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Latest News