by Suryaa Desk | Tue, Dec 24, 2024, 03:05 PM
తాడిపత్రి పట్టణంలోని బీహెచ మహల్ థియేటర్ సమీపంలో సోమవారం మద్యం మత్తులో ఘర్షణపడిన సంఘటనలో ఒకరికి తీవ్రగాయాలు కాగా మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడని పట్టణ పోలీసులు తెలిపారు.స్థానిక గాంధీనగర్‌కు చెందిన బాబాఫకృద్దీన, వెంకటే్‌షతోపాటు మరికొంతమంది మద్యం సేవించారు.
అనంతరం ఇంటికి వస్తున్న సమయంలో వారి మధ్య డబ్బుల విషయంలో మాటమాట పెరిగి ఘర్షణ జరిగింది. ఇందులో వెంకటే్‌షకు గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాబాఫకృద్దీన తలకు స్వల్పగాయమైంది. చికిత్స నిమిత్తం ఇరువురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వెంకటే్‌షను అనంతపురం తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేస్తామని పోలీసులు తెలిపారు.
Latest News