by Suryaa Desk | Tue, Dec 24, 2024, 03:09 PM
కశింకోట మండలంలో మరమ్మతుకు గురైన గ్రోయిన్లను బాగు చేయిస్తామని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చెప్పారు . అంతకుముందు రూ.1.1 కోట్లతో కశింకోట పడమటమ్మ తల్లి గుడికి వెళ్లే రహదారి నిర్మాణానికి, రూ.1.47 కోట్లతో గోపాలపురం- చిన్నముసిలివాడ రోడ్డు నిర్మాణానికి, రూ.1.96 కోట్లతో సంపతిపురం- కశింకోట రోడ్డు నిర్మాణానికి అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, చైర్మన్ మళ్ల సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, సంపతిపురం సర్పంచ్ నంబారు నాగమణి, వివిధ పార్టీలకు చెందిన వేగి గోపీకృష్ణ, సిదిరెడ్డి శ్రీనివాసరావు, కాండ్రేగుల సతీశ్‌కుమార్, నంబారు శ్రీను, కాయల మురళీ, గొంతిన శ్రీనివాసరావు, చదరం నాగేశ్వరరావు, ఎంపీడీవో రవికుమార్, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Latest News