by Suryaa Desk | Tue, Dec 24, 2024, 03:28 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి న్యూట్రల్‌గానే ఉన్నామని, మాకు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మేం కూటమిలో లేమని వెల్లడించారు. నలభైనాలుగు సంవత్సరాల అనుభవాన్ని ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. కరెంటు చార్జీల పెంపుపై వైయస్ఆర్‌సీపీ పోరుబాట పోస్టర్‌ను మంగళవారం మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్,బూడి ముత్యాల నాయుడులతో కలిసి విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.... మేము ఎన్డీఏ కాదు.. ఇండియా కూటమి కాదు..మేము మొదటి నుంచి న్యూట్రల్‌గానే ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. మేము మొదటి నుండి చెప్తున్నాం జమిలి ఎన్నికలు వస్తాయని. జమిలి జేపీసీలో నేను కూడా ఒక సభ్యుడుని. జేపీసీలో ప్రతి రాష్ట్రంలోి పర్యటిస్తుంది.. ప్రతి రాజకీయ పార్టీని కలుస్తుంది. జేపీసీకి పార్టీ వైఖరిని వైయస్ జగన్ స్పష్టం చేస్తారు అని తెలియజేసారు.
Latest News