రామేశ్వరం ఆలయం ప్రాంగణంలో దారుణం.. మహిళలు బట్టలు మార్చుకునే గదిలో స్పై కెమెరా!
 

by Suryaa Desk | Tue, Dec 24, 2024, 07:00 PM

బాత్రూంలు, బట్టలు మార్చుకునే గదుల్లో స్పై కెమెరాలు పెడుతూ.. మహిళలు తమ పనులు చేసుకుంటుండగా చాటుమాటుగా చూసే వారి సంఖ్య అంతంకంతకూ పెరిగిపోతుంది. మొన్నటికి మొన్న మహిళా టీచర్ల బాత్రూంలో, నిన్నటికి నిన్న స్కానింగ్ సెంటర్లో సీక్రెట్ కెమెరాలు దొరకగా.. తాజాగా ఓ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనే పునరావృతం అయింది. రామేశ్వరంలోని ఆలయ ప్రాంగణంలో మహిళలు బట్టలు మార్చుకునే గదిలో స్పై కెమెరా గుర్తించిందో మహిళ. ఈక్రమంలోనే పోలీసులను ఆశ్రయించింది. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


తమిళనాడులోని రామేశ్వరం ఆలయం గురించి దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ తెలుసు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఈరోజు ఓ దారుణం వెలుగు చూసింది. పుదుకోట్టైకి చెందిన ఓ మహిళ తన కుటుంబంతో కలిసి రామేశ్వరాలయాన్ని దర్శించుకునేందుకు వచ్చింది. ఈక్రమంలోనే సోమవారం ఉదయమే నిద్ర లేచిన వీళ్లు.. నేరుగా గుడి వద్ద ఉన్న అగ్ని తీర్థం వద్దకు వచ్చారు. ఇక్కడే పుణ్య స్నానాలు చేశారు. అయితే పురుషులు అంతా తీరంలోనే బట్టలు మార్చుకోగా.. మహిళ మాత్రం ఓ ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన బట్టలు మార్చుకునే గదిలోకి వెళ్లింది.


తడిబట్టలతో వెళ్లిన ఆ మహిళ పొడి బట్టలు పెట్టేందుకు హ్యాంగర్ కోసం వెతికింది. ఈక్రమంలోనే గదంతా పరిశీలించిన ఈమెకు.. అక్కడ స్పై కెమెరా కనిపించింది. దీంతో భయపడిపోయిన మహిళ తన బట్టలు తీసుకుని వెంటనే కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లింది. జరిగిన విషయం గురించి కుటుంబ సభ్యులతో పాటు అక్కడి ఆలయ సిబ్బందికి చెప్పింది. ఆపై స్థానికంగా ఉన్న పోలీసులను ఆశ్రయించింది. మహిళలు బట్టలు మార్చుకునే గదిలో ఉన్న సీక్రెట్ కెమెరాల గురించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి చూశారు.


ఈ క్రమంలోనే స్పై కెమెరాలను స్వాధీనం చేసుకుని.. వాటిని పెట్టిన వారెవరో దర్యాప్తు చేశారు. ముఖ్యంగా ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన ఈ గది నిర్వాహకుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్‌లో విచారించారు. అప్పుడే అతడు తనతో పాటు టీ స్టాల్‌లో పనిచేసే మీరా మొయిద్దీన్ అనే వ్యక్తి కూడా ఆ దృశ్యాలు చూస్తున్నట్లు చెప్పాడు. దీంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరిద్దరి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మరోవైపు ఆలయ అధికారులు.. ఈ ఘటనపై స్పందించారు. ఆలయంలో ఇలాంటి చర్యలు జరగడం చాలా బాధగా అనిపించిందని చెప్పారు. అంతేకాకుండా ముందు ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు.

Latest News
Court reserves order on Allu Arjun's regular bail petition Mon, Dec 30, 2024, 05:07 PM
Telangana Assembly passes resolution for Bharat Ratna to Manmohan Singh Mon, Dec 30, 2024, 05:05 PM
AIMJ chief's fatwa against New year celebrations draws stern criticism Mon, Dec 30, 2024, 04:58 PM
Govt rolling out Rs 15,000 crore roadmap to help steel industry cut carbon emissions Mon, Dec 30, 2024, 04:50 PM
Spreading same lies won't make it truth: Hardeep Puri tears into Kejriwal over Rohingya claims Mon, Dec 30, 2024, 04:49 PM