హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను మేమే చంపేశాం: ఇజ్రాయెల్
 

by Suryaa Desk | Tue, Dec 24, 2024, 07:48 PM

హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియాను తామే చంపామని.. తాజాగా ఇజ్రాయెల్ ప్రభుత్వం బహిరంగంగా ఒప్పుకుంది. జులై నెలలో ఇరాన్ రాజధాని అయిన టెహ్రాన్‌లో హనియను హత్య చేసినట్లు... ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ధ్రువీకరించారు. అలాగే వాళ్లు సాధించిన అనేక విజయాల గురించి వివరించారు. ముఖ్యంగా యొమెన్‌లోని హుతీలకు గట్టి వార్నింగ్ ఇస్తూ... ఓ వీడియోను విడుదల చేశారు. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఏమేం చేసింది.. ముందు ముందు ఏమేం చేయబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఇరాన్ రాజధాని ట్రెహ్రాన్‌లోని ఆ దేశ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార ఉత్సవానికి హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడ హత్యకు గురయ్యారు. అయితే ఇదంతా చేసింది ఇజ్రాయెల్‌యే అని ఇరాన్ అప్పుడే చెప్పింది. ప్లాన్ ప్రకారమే వాళ్లు ఈ దాడికి పాల్పడ్డట్లు కూడా వివరించింది. కానీ దీనిపై ఇజ్రాయెల్ అప్పట్లో స్పందించలేదు. దాదాపు 5 నెలల తర్వాత అంటే ఇప్పుడు తాజాగా స్పందించింది. అవును.. మేమే హనియాను చంపామంటూ చెప్పుకొచ్చింది.


ముఖ్యంగా టెల్అవీర్ రక్షణ మంత్రి కాట్జ్ తాజాగా తాము సాధించిన విజయాల గురించి చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో హుతీ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై ఎక్కువగా క్షిపణులు ప్రయోగిస్తుందని వివరించారు. ఈ సందర్భంగానే వారికి ఓ స్పష్టమైన సందేశం అందించాలనుకుంటున్నట్లు తెలిపిన కాట్జ్.. హమాస్, హెజ్ బొల్లాలను ఓడించినట్లు స్పష్టం చేశారు. ఇరాన్ రక్షణ, ఉత్పత్తి వ్యవస్థలను తామే నాశనం చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా సిరియాలో బషల్ అల్ అసద్ పాలనను పడగొట్టామని.. అది మాత్రమే కాకుండా వారి మౌలిక సదుపాయాలను దెబ్బతీశామన్నారు. ఇవి మాత్రమే కాకుండా హనియా, సిన్వర్, నస్రల్లాలను హత్య చేసినట్లు అధికారికంగా వెల్లడించారు.


అయితే యెమెన్‌లోని హుతీలకు కూడా గట్టి దెబ్బ తప్పదు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్ని చేసిన ఇజ్రాయెల్.. హుతీలను ఏ రేంజ్‌లో దెబ్బ కొడుతుందో చూడాలని అనుకుంటున్నారు. అయితే గాజాలో యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి హుతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేస్తున్నారు. వీరికి ఇరాన్ కూడా మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగానే తాము ఇదంతా చేస్తున్నట్లు హుతీలు చెప్పారు.


ఇజ్రాయెల్ గాజాపై యుద్ధాలు ఆపే వరకు తాము ఈ దాడులు చేస్తామని కూడా హుతీలు వెల్లడించారు. ఇది గుర్తించిన ఇజ్రాయెల్ హుతీల సైనిక స్థావరాలే లక్ష్యంగా ప్రతిదాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే రక్షణ మంత్రి గాడ్జ్.. హుతీలకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

Latest News
Calling Uddhav Thackeray a traitor is insult to Balasaheb and Maharashtra: Sanjay Raut Mon, Jan 13, 2025, 02:11 PM
Post-Article 370, J&K witnessing rapid growth under PM Modi: Naqvi on Sonamarg tunnel opening Mon, Jan 13, 2025, 02:09 PM
Patparganj: Kejriwal approaches EC as Avadh Ojha faces threat of disqualification Mon, Jan 13, 2025, 01:59 PM
IPL 2025 to begin on March 21 in Kolkata: Report Mon, Jan 13, 2025, 01:11 PM
Didn't really take selection out of the selectors' hands, says Abbott on missing CT25 Mon, Jan 13, 2025, 01:08 PM