బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడుల వేళ.. యూనస్‌ను అభినందించిన అమెరికా
 

by Suryaa Desk | Tue, Dec 24, 2024, 07:47 PM

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం హిందువులు సహా పలు మైనారిటీ వర్గాలపై దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అనేక దేశాలు ఈ దాడులపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈక్రమంలోనే తాజాగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌కు ఫోన్ చేశారు. అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీశారు. తాము కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని తాజాగా అమెరికా వెల్లడించింది. ఆ పూర్తి విశేషాలు మీకోసం..!


మతానికి అతీతంగా ప్రజలందరి మానవ హక్కులను గౌరవించడం, రక్షించడం కోసం ఇద్దరు నేతలు నిబద్ధతను వ్యక్తం చేశారు. కష్టకాలంలో బంగ్లాదేశ్‌కు నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్‌ను సలివన్ అభినందించారు. అలాగే ఆ దేశం సంపన్నమైన, స్థిరమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సలివన్.. యూనస్‌కు హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని వైట్‌హౌస్ ప్రకటన ద్వారా తెలిపింది.


15 రోజులుగా పెరిగిన దాడులు..!


గత రెండు వారాలుగా బంగ్లాదేశ్‌లో హిందువలపై క్రూరమైన దాడులకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై హిందూయాక్షన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్సవ్ చక్రవర్తి స్పందించారు. గత ఐదున్నర నెలల్లో జరిగిన దాడులను అదుపు చేయడంలో.. మహమ్మద్ యూనస్ విఫలం అయ్యారని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్‌లోని అనేక గుడులను తగులబెట్టడంతో పాటు, అనేక మంది మైనారిటీలను చంపేస్తున్నారని వివరించారు.


చిన్మోయ్ దాస్ వంటి వారిని జైల్లో పెట్టి..!


మహిళలపై హత్యాచారాలతో పాటు అనేక మందిని హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే హిందూ మత పెద్దలతో పాటు పలువురు ప్రముఖులను జైల్లో పెట్టి హింసిస్తున్నారని వెల్లడించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని 15 మిలియన్ల (బౌద్దులు, క్రౌస్తవులతో పాటు హిందువులందరికీ) ప్రజలకు స్వయంప్రతిపత్తి మండలాలం కోసం తాము కృషి చేస్తున్నట్లు ఉత్సవ్ చక్రవర్తి తెలిపారు.


మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ..!


మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచినప్పటి నుంచి మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయి. అయితే తాజాగా బంగ్లా ప్రభుత్వం.. షేక్ హసీనాను తిరిగి అప్పగించాలంటూ భారత దేశానికి అధికారికంగా నోటీసులు జారీ చేసింది. హసీనాను న్యాస్థానం ముందు నిలబెట్టాల్సి ఉన్నందును ఆమెను అప్పగించమని కోరుతున్నట్లు కూడా చెప్పగా.. భారత్ కూడా దీన్ని ధ్రువీకరించింది. కానీ హసీనాను అప్పగిస్తారా లేదా అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

Latest News
Press Club must have larger professional purpose: Dr Singh had told journalists in Chandigarh Fri, Dec 27, 2024, 12:40 PM
Anna University sexual assault case: TN BJP chief lashes himself in protest Fri, Dec 27, 2024, 12:27 PM
4 chip manufacturing units, 3 supercomputers this year to boost India's global tech position Fri, Dec 27, 2024, 12:26 PM
IMA's new certification for hospitals to promote best practices in antimicrobial usage Fri, Dec 27, 2024, 12:22 PM
Dr Singh's reforms inspired countless young economists like me: Gita Gopinath Fri, Dec 27, 2024, 12:18 PM