by Suryaa Desk | Tue, Dec 24, 2024, 08:07 PM
టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. తిరుమల పర్యటనలో భక్తుల
ఆరోగ్య సమస్యలు గుర్తించి సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. భక్తులకు అందించే సేవలపై, వారి సమస్యలను తెలుసుకునేందుకు ఫీడ్ బ్యాక్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.