by Suryaa Desk | Fri, Jan 24, 2025, 05:05 PM
ఇంటిపై దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉన్న పది బాక్సుల కర్ణాటక మద్యాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ మహే్‌షకుమార్ తెలిపారు. రాయదుర్గం పట్టణంలోని ఎక్సైజ్ పోలీ్‌సస్టేషనలో గురువారం ఆయన ఇందుకు సంబంధించన వివరాలను విలేకరులకు తెలిపారు.పట్టణంలోని భంభంస్వామి ఏరియాలో నివాసముంటున్న ఎరుకుల నాగరాజు ఇంట్లో కర్ణాటక మద్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారం రావడంతో వెంటనే దాడులు చేశామన్నారు. ఆ ఇంట్లో తనిఖీ చేయగా.. పది బాక్సుల టెట్రాప్యాకెట్లు లభ్యమయ్యాయన్నారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిని నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఎరుకుల నాగరాజు, చాకలి విశ్వనాథ్ పరారైనట్లు తెలిపారు. రూ. 50 వేల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఎవరైనా కర్ణాటక మద్యాన్ని సరఫరా చేసినా, అమ్మకాలు చేసినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్‌ఐ పవనకుమార్, పీసీలు సోము, వెంకటేశులు, లాలు, కవీంద్ర, శాంతి తదితరులు పాల్గొన్నారు.
Latest News