by Suryaa Desk | Fri, Jan 24, 2025, 05:06 PM
సున్నిపెంట అభివృద్ధిపై ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ఏపీ జెన్‌కో కార్యాలయంలో ఇరిగేషన్, పీఆర్, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సున్నిపెంట అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికబద్దంగా వ్యవహరించాలని, ప్రత్యేకించి గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని సూచించారు. ప్రస్తుతం రూ.3.2కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు చొరవతో మరో రూ.5కోట్ల నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా రూపొందించాలని పీఆర్ అధికారు లను ఆదేశించారు. అదేవిధంగా గ్రామంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంగా వ్యవహరించాలన్నారు. వేసవిలో సున్నిపెంటలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీడీపీ నాయకులు వై.యుగంధర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో సుబ్రమణ్యం, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఉమాకాంత్‌రెడ్డి, ఏఈ పక్కిరయ్య, ఇరిగేషన్ డీఈ మోహన్, ఏఈలు చిట్టిబాబు, తంగరాజు, ఎలక్ట్రికల్ ఏఈ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
Latest News