by Suryaa Desk | Sat, Jan 25, 2025, 01:22 PM
దావోస్ నుంచి ఉత్తి చేతులతో రాష్ట్రానికి తిరిగి రావడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు సిగ్గు లేదా?. ఏ ముఖం పెట్టకుని ఏపీలో అడుగు పెడుతున్నారని అని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా నిలదీశారు. తిరుపతి జిల్లా నగరిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే దావోస్‌లో పారిశ్రామికవేత్తలు పారిపోయారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల వారు లక్షల కోట్లు పెట్టుబడులతో తిరిగి వస్తుంటే.. చంద్రబాబు మాత్రం కట్టుకథలతో వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ వేదికగా అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను తండ్రీ కొడుకులిద్దరూ సర్వనాశనం చేశారని ఆర్‌కె రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Latest News