by Suryaa Desk | Sat, Jan 25, 2025, 01:23 PM
స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ రాజకీయ పార్టీ చేయలేనంత గొప్పగా వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మంచి చేసిందని, దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో తమ ఆలోచనలను సమర్థంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే పార్టీలకే సానుకూలత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆ దిశలోనే వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ ఆలోచనలు, ఆచరణను పార్టీ నేతలు ఆత్మవిశ్వాసంతో ప్రజల్లో వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా కమ్యూనికేషన్స్‌పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా కమ్యూనికేషన్స్‌పై దిశానిర్దేశం చేశారు.
Latest News