by Suryaa Desk | Sat, Jan 25, 2025, 01:24 PM
ఒకవైపు ప్రక్షాళనతో పార్టీ పునఃనిర్మాణం చేస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని వైయస్ జగన్ పార్టీ కేడర్‌కు పిలుపు ఇస్తున్నారు. చంద్రబాబు మళ్లీ మేనిఫెస్టో విషయంలో మోసానికి దిగారు. సూపర్ సిక్స్ పేరిట ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా గత ప్రభుత్వంపై నిందలతోనే కాలాయాపన చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని కేడర్‌కు గుర్తు చేస్తున్నారు. ఐదారు నెలలకే చంద్రబాబు సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు కష్టకాలంలో ఉన్నారని, ఈ టైంలో ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు. ఇప్పటికే రైతు పోరుబాట, విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా కార్యక్రమాలు జరిగాయి. ఫిబ్రవరి 5న ఫీజు రియంబర్స్‌మెంట్ నిధుల విడుదల కోరుతూ మరో ధర్నాకు సిద్ధమైంది. మొత్తంగా.. పార్టీలో పోరాట పటిమ తగ్గకూడదని వైయస్ జగన్ ఇచ్చిన పిలుపుతో మరిన్ని ప్రజాపోరాటాలకు వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ అనే సంకేతాలిస్తోంది.
Latest News