by Suryaa Desk | Sat, Jan 25, 2025, 01:49 PM
రాజీనామాపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాజకీయాల నుంచి వైదొలగితే నేను ఇంకా బలహీనుడినవుతాను తప్ప బలవంతుడిని కాను. అలాంటప్పుడు కేసులు ఎలా తప్పిస్తారు.
నా రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుందే తప్ప వైసీపీ కాదు. వైసీపీకి 11 మంది బలం మాత్రమే ఉంది. ఎలాంటి ఆశలు, కేసు మాఫీలు నేను ఆశించలేదు' అని చెప్పారు.