by Suryaa Desk | Sat, Jan 25, 2025, 01:54 PM
విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలిగినా చట్టం నుంచి తప్పించుకోలేరని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై విమర్శలు గుప్పించారు. విజయ సాయిరెడ్డి వల్ల విశాఖపట్నంలో జరిగిన విధ్వంసం, ప్రజలు పడిన ఇబ్బందులు మరిచిపోలేదని చెప్పారు. జగన్ తీరుతోనే వైసీపీకి ఈ గతి పట్టిందన్నారు. త్వరలోనే మరికొంతమంది ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Latest News